చవక.. చవక! సూర్యకాంతి చాలు.. సెవెన్ సీటర్ సోలార్ బైక్..

by Ramesh N |   ( Updated:2024-04-06 17:38:20.0  )
చవక.. చవక! సూర్యకాంతి చాలు.. సెవెన్ సీటర్ సోలార్ బైక్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలు పెట్రోల్ కొట్టించి బైక్ నడపాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరూ ఎలక్ట్రికల్‌ బైక్‌లను వాడుతున్నారు. ఎలక్ట్రికల్‌ బైక్ కంటే బెటర్‌గా అన్నింటకీ భిన్నంగా సౌరశక్తితో నడిచే బైక్‌ను ఓ వ్యక్తి తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ బిజినెస్‌మెన్, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఈ వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోలో బైక్ తయారు చేసిన యువకుడు చెప్పిన ప్రకారం.. అది సెవెన్ సీటర్ బైక్ అని, కేవలం సూర్యకాంతితో బండినడుస్తుందని తెలిపారు. ఈ బండి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళుతుందన్నారు. తానే ఆ బైక్ తయారు చేసినట్లు వెల్లడించారు. అయితే టెస్లా అనే విదేశి కంపెనీ భారత్ వైపు చూస్తున్నదని, కానీ భారత్‌లో ఇలాంటి కాంపీటేషన్ ఉంటే ఆ కంపెనీ పరిస్థితి ఏమైపోవాలని గోయెంకా ట్విట్టర్ వేదికగా తాజాగా ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ బైక్ తయారు చేసిన యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed