- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Video Viral:‘వామ్మో..పాముకు భలే డేర్ ఉందిగా’..ఎయిర్ పోర్టులో పాము, ముంగిసల ఫైట్!
దిశ,వెబ్‌డెస్క్: పాము, ముంగిసల మధ్య వైరుధ్యం తరతరాలుగా ఉన్నదే. పాము ముంగిస ఎదురు పడితే హోరాహోరీ ఫైట్ తప్పదు. దీనికి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ముంగిస, పామును చూడడంతోనే కోపంతో ఊగిపోయి చంపాలని చూస్తుంది. ఎందుకంటే..ముంగిస పిల్లలను పాము తింటుంది. దీంతో తన పిల్లలను రక్షించడానికి పాము పై ముంగిస దాడి చేసి చంపి తింటుంది. ఈ క్రమంలో పాములోని విషపు సంచిని మాత్రం తినకుండా వదిలేస్తుంది. పాము కంటే ముంగిస చురకైంది. పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసకు ఉండటంతో ఫైట్ లో 80 శాతం ముంగిసనే గెలుస్తుందంట. అయితే సాధరణంగా అడవుల్లో కనిపించే వాటి ఫైట్‌కు ఈ సారి బీహార్‌లోని పట్నా ఎయిర్ పోర్టు వేదికైంది.
ఏకంగా విమానాశ్రయం రన్ వే పైనే ఓ తాచుపాముతో మూడు ముంగిసలు యుద్ధానికి దిగాయి. ముంగిస ఎంతో గాలిలో ఎగిరి దాడికి ప్రయత్నించిన కూడా పాము తప్పించుకుంది. దీంతో ఇక ముంగిస అలిసి పోయి అక్కడే ఉండి చూస్తున్న తన ఫ్రెండ్స్ ఇద్దరికి సైగ చేసింది. దీంతో మెల్లగా మరో రెండు ముంగిసలు కూడా పాము పైకి దాడి చేయడానికి అక్కడికి వచ్చాయి. అయిన కూడా పాము ఏ మాత్రం బెదిరిపోలేదు. అంతేకాదు మూడు ముంగిసలతో ఫైటింగ్ చేసింది. ఈ వీడియోను దూరం నుంచి కొందరు తమ ఫోన్ లలో రికార్డు చేసి, ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు..‘వామ్మో..పాముకు భలే డేర్ ఉందిగా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.