- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవర్రా మీరంతా ‘చవక’ సోడా బండి! వైరల్ పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: యూట్యూబ్‌లో యాక్టీవ్ ఉండేవారికి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రపంచంలోనే అనేక ప్రాంతాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తుంటారు. ఆయన పెట్టే ఒక్కో వీడియో గంటల్లో మిలియన్స్ పైగా వ్యూస్ వస్తుంటాయి. అయితే ఆయనకు తక్కువ డబ్బుతో ఫుడ్ దొరికిన, ఫ్రీగా తినడానికి ఏమైనా తనకు లభించిన కూడా ‘చవక’ అనే ఊత పదం వాడుతుంటారు. ఈ ‘చవక’ అనే పదం సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే వరంగల్ లో ఓ యువకుడు తన సోడా బండికి ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పేరుతో పోస్టర్ పెట్టాడు.
చల్లని నిమ్మ సోడా చవక ధర రూ. 20, లస్సి చవక ధర రూ. 30 అని ధరలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై యూట్యూబర్ నా అన్వేషణ స్పందించారు. ఎవర్రా మీరంతా.. అని వీడియోకి కామెంట్ చేశారు. చవక అని పెట్టి 15 రూపాయలు ఉన్నదాన్ని 20 రూపాయలు పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోడా బండి బిజినెస్ సక్సెస్ కావాలని నెటిజన్లు ఆ యువకుడిని అభినందిస్తున్నారు.