పరారీలో ప్రముఖ సినీనటి జయప్రద .. ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-02-28 09:38:38.0  )
పరారీలో ప్రముఖ సినీనటి జయప్రద .. ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో నటి జయప్రద నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు జయప్రదను ఆదేశించింది. అయినా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జనవరి 10న కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ప్రత్యేక కోర్టు ఆమెను పరారీలో ఉన్నట్లుగా ప్రకటించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంబంధించి ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ, జయప్రద కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆమెపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మార్చి 6న జయప్రద కోర్టుకు హాజరు అయ్యేలా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని న్యాయమూర్తి శోభిత్ బన్సార్ ఎస్పీని ఆదేశించారు. జయప్రదపై సెక్షన్-82 CRPC కింద కేసు నమోదుచ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story