- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral: ఫోన్ లో మునిగి బిడ్డను పార్క్ లోనే మర్చిపోయిన తల్లి.. వీడియో వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం డిజిటల్ హావా నడుస్తోంది. సెల్ ఫోన్లు మనుషుల జీవితాలను పూర్తిగా మార్చేశాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక అవి లేకుండా గంట కూడా గడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఫోన్ (Phone) కనిపించకపోతే శరీరంలో ఏదో అవయవం కోల్పోయామేమో అన్నంతలా వాటిల్లో మునిగి తేలుతూ మిగతా ప్రపంచాన్నే మర్చిపోతున్నవారిని సమాజంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఓ షాకింగ్ ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెల్ ఫోన్ లో మునిగిపోయిన ఓ తల్లి తన బిడ్డను పార్క్ లోనే మర్చిపోయి (Mother Forgets Her Baby) వెళ్లిపోయింది . ఇది గమనించిన ఓ పెద్దాయన ఆ చంటి బిడ్డను ఎత్తుకుని ఓ మేడం.. అంటూ కేకలు వేసి సదరు మహిళను పిలిచాడు. అతడి పిలుపును విన్న సదరు మహిళ పరుగున వెనక్కి వచ్చి తన బిడ్డను తీసుకుంటుంది. ఇది ఇండియాలో ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ @gharkekalesh అనే యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral video) గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ తల్లికి పేగు బంధం కంటే సెల్ ఫోనే ఎక్కువైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఇది స్క్రిప్టేట్ వీడియో అని ఓ సీరియల్ షూటింగ్ లో భాగంగా తీసిన వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు రియాక్ట్ అవుతూ ఇది స్క్రిప్ట్ వీడియో అయినప్పటికీ సమాజంలో సెల్ ఫోన్ వినియోగం వల్ల జరుగుతున్న దుష్పరిణామాలను ఎత్తిచూపుతున్నదని కామెంట్ చేస్తున్నారు.