ఆర్బీఐ కంటే స్మార్ట్ ఐడియా!'

by Mahesh |   ( Updated:2023-05-25 12:48:24.0  )
ఆర్బీఐ కంటే స్మార్ట్ ఐడియా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించడంతో ఆ నోట్లు పెద్ద సంఖ్యలో కలిగి ఉన్నవారు వాటిని వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీదైన వస్తువులు, బంగారం కొనుగోలు చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే రూ.2 వేల విషయంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఓ వ్యక్తి తన బిజినెస్‌కు అనుకూలంగా మార్చుకుని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. అతడి ఐడియాను చూసిన నెటిజన్లు వాట్ యాన్ ఐడియా సర్ జీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఢిల్లీలోని జీటీబీ నగర్‌కు చెందిన ఓ మాంసం వ్యాపారి తమ దుకాణంలో రూ.2వేల నోటుతో కొనుగోలు చేస్తే రూ.2100 సరుకు అందజేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ ప్రకటనకు సంబంధించి దుకాణం ముందు ఉంచిన బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్బీఐ తనను తాను తెలివేందనదిగా భావిస్తే ఢిల్లీ ప్రజలు అంతకంటే తెలివైన వారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా వ్యాపార ప్రచారానికి ఇది సరైన ఎత్తుగడ అని మరొకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ బిజినెస్ సెన్స్ అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడమే కామెంట్ చేశారు.

Advertisement

Next Story