అచ్చం మనుషుల్లా నడుస్తున్న జంతువులు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!(వీడియో వైరల్)

by Jakkula Mamatha |   ( Updated:18 Feb 2025 12:19 PM  )
అచ్చం మనుషుల్లా నడుస్తున్న జంతువులు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: పక్షులు(Birds) , జంతువులు(animals) చేసే పనులు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వాస్తవానికి ప్రకృతిలో ఉన్నంతా ఎంటర్‌టైన్‌మెంట్(Entertainment) ఎక్కడ ఉండదు అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేచర్ ఎన్నో కొత్త విషయాలు నేర్పుతుంది. అంతేకాదు మనల్ని చిన్నపిల్లల్లా కూడా నవ్విస్తుంటుంది. ఇక ప్రకృతిలో భాగమైన పక్షులు, జంతువులు చేసే చేష్టలు భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటుంది.

అయితే కొన్నిసార్లు జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. ఇక మనుషుల మాదిరిగానే వాటి పిల్లలపై అవి చూపించే ఎమోషన్స్.. మనతో ప్రవర్తించే తీరు చూస్తుంటే షాకింగ్‌‌ను కూడా కలిగిస్తుంటాయి. కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు చూస్తే సరదాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కలిగిస్తాయి. ఈ క్రమంలో తాజాగా జంతువులు(animals) మనుషుల వలె నడుస్తున్న ఓ వీడియో చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జంతువులు మనుషుల్లాగా నడవంటేమెంటి అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.

అయితే.. మనుషులు కూడా ఒకప్పుడు వానర జాతి నుంచి అభివృద్ధి చెందిన వారే అన్నది జీవ పరిణామ సిద్ధాంతం చెబుతోంది. క్రమంగా మానవులు అభివృద్ధి చెంది.. రెండు కాళ్లతో నడవడం, ఆలోచించడం వంటివి నేర్చుకున్నారు. ఒకవేళ జంతువులు కూడా రెండు కాళ్లతో నడిస్తే ఎలా ఉంటుందనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచన వచ్చిన కొందరు వివిధ జంతువులు రెండు కాళ్లపై నడిస్తే ఎలా ఉంటుందనేది AI సాయంతో సృష్టించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆశ్చర్యపరిచే వీడియో చూసిన నెటిజన్లు సింహం నడక మాత్రం హైలైట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed