బాత్‌రూమ్‌కు వెళ్లేటప్పుడు చెక్ చేసుకోకపోతే ప్రాణాలు పోవడం ఖాయం! షాకింగ్ వీడియో

by Disha Web Desk 6 |
బాత్‌రూమ్‌కు వెళ్లేటప్పుడు చెక్ చేసుకోకపోతే ప్రాణాలు పోవడం ఖాయం! షాకింగ్ వీడియో
X

దిశ, ఫీచర్స్: చాలా మంది పాములు కనిపిస్తేనే వణికిపోతుంటారు. అలాగే కలలో పామును చూసినా కానీ నిద్రలో ఉలిక్కి పడతారు. అలాంటిది ఈ మధ్య కాలంలో పాములు ఎక్కడా చోట లేనట్లు ఇటీవల బాత్‌రూమ్‌లో చొరబడి అందరికీ షాకిస్తున్నాయి. కొందరు ముందుగా చెక్ చేసుకుని పోవడం వల్ల ప్రమాదాలు జరగడం లేదు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూమ్‌లో టాయిలెట్‌కు వెళ్తుండగా.. లోపల నుంచి బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. కానీ అతను పట్టించుకోకుండా టాయ్‌లెట్‌కు వెళ్లడంలో నిమగ్నమయ్యాడు.

కానీ శబ్దం మరింత పెరిగి భయంకరంగా వస్తుండటంతో అనుమానం వచ్చి చెక్ చేశాడు. లోపల 10 అడుగుల పెద్ద పాము బుసలు కొడుతూ బయటకు రావడంతో పైకి లేచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. పాములు పట్టే వారిని పిలిపించి పట్టించి పంపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. టాయిలెట్‌కు వెళ్లే ముందు చెక్ చేసుకోకపోతే పాముల వల్ల ప్రాణాలు పోతాయని అంటున్నారు.

Next Story

Most Viewed