రిపబ్లిక్ డే వేడుకల వేళ.. బాలుడి పాదాలకు నమస్కరించిన సీఎం

by Hajipasha |
రిపబ్లిక్ డే వేడుకల వేళ.. బాలుడి పాదాలకు నమస్కరించిన సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నమస్కరించారు. కర్నాల్ నగరంలోని మైదానంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో సీఎం ఖట్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు స్టూడెంట్స్ రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. కళా ప్రదర్శన ముగిసిన అనంతరం సీఎం ఖట్టర్‌ వేదికపై నుంచి దిగి నేరుగా ఆ చిన్నారుల వద్దకు వెళ్లి.. రాముడి వేషధారణలో ఉన్న బాలుడి పాదాలకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Advertisement

Next Story

Most Viewed