Guinness world Record: టమోటాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

by Prasanna |
Guinness world Record: టమోటాలతో  గిన్నిస్ వరల్డ్ రికార్డ్
X

దిశ, ఫీచర్స్: మన ఇళ్లలో చాలా మంది కత్తితో కూరగాయలు కోస్తుంటారు. కొంత మంది చూసుకోకుండా చేతులను కట్ చేసుకుంటారు. ఆ సమయంలో పెద్ద వాళ్ళు కళ్ళు ఎటు పెట్టుకుని కట్ చేసావ్ అని తిడుతుంటారు. కానీ, కెనడాకు చెందిన ఈ చెఫ్ కళ్ళకు గంతలు కట్టుకుని టమోటాలను కట్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అతని టాలెంట్ ను మెచ్చుకుని ఆ కటింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు.

ఆ వీడియోలో చెఫ్ కళ్లకు గంతలు కట్టుకుని టేబుల్ బోర్డు మీద పెట్టిన టమోటాలు ఉన్నాయి. టైమ్‌ స్టార్ట్ అనగానే కత్తితో టమాటాలన్నీ కట్‌ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా ఆ యువకుడు 60 సెకండ్లలో 9 టమోటాలను చాలా సులభంగా కట్ చేశాడు. అక్కడే ఉన్న లేడీ జడ్జ్‌ అతన కటింగ్ చూసి ఆశ్చర్యపోయింది. 1 నిమిషం చివరలో 4 టమోటాలు ఎక్కువే కట్‌చేశాడు. కానీ, అవి ఒకే పరిమాణంలో లేవని కౌంట్ చేయలేదు. అయితే పర్ఫెక్ట్‌ కట్ చేసినందుకు కెనడియన్ చెఫ్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story