Fishing: వర్షాల ఎఫెక్ట్.. రోడ్లపై ఈత కొట్టిన చేపలు! వల వేసి పట్టుకున్న జనం

by Ramesh N |
Fishing: వర్షాల ఎఫెక్ట్.. రోడ్లపై ఈత కొట్టిన చేపలు! వల వేసి పట్టుకున్న జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లపై చేపలు ఈతలు కొట్టడం.. రోడ్లపై వల వేసి చేపలు పట్టడం ఎప్పుడైనా చూశారా? అవును మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ ‌లోని కోనసీమ జిల్లాల్లో ఈ వింత జరిగింది. గత రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో చెరువులు, వాగులు, కుంటలు నిండు కుండలా మారాయి. అయితే, ఈ క్రమంలోనే కోనసీమ జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా సఖినేటిపల్లిలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో చేపలు ఈత కొడుతున్నాయి.

ఇది చూసిన స్థానికులు వలలు తెచ్చి చేపలను పట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వల వేసి పట్టడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, రోడ్లపై నిలిచిన నీటిలోకి చేపలు రావడం కారణం స్థానికంగా ఉండే వాగు, లేక చెరువు వర్షానికి నిండటం వల్ల చేపలు వచ్చినట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed