చీరకట్టుతో మహిళలు ఫుట్‌బాల్ అడితే ఎలా ఉంటుందో తెలుసా..(వీడియో)

by Mahesh |   ( Updated:2023-03-29 12:23:17.0  )
చీరకట్టుతో మహిళలు ఫుట్‌బాల్ అడితే ఎలా ఉంటుందో తెలుసా..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాశ్చత్య దేశాల్లో ఫుట్ బాల్ కు ఉన్న క్రేజ్ మరో ఆటకు ఉండదు. అలాంటి ఆటకు మన ఇండియాలో అంత ఆదరణ లేకపోయినప్పటికి ఇప్పుడిప్పుడే.. ఫుట్ బాల్ ఆటను ట్రై చేస్తున్నారు. అయితే కేవలం పురుషులకు మాత్రమే అన్నట్లు ఉంటే ఈ గేమ్‌ను మహిళలు కూడా ఆడుతున్నారు. అది కూడా చీర కట్టులో.. అవునండి మీరు చదివింది నిజమే.. మహిళలో పక్కా సాంప్రదాయ చీర కట్టుతో ఫుట్ బాల్ ఆడుతున్నారు. ఈ వినూత్న మ్యాచ్ గ్వాలియర్ లోని జరిగింది. దీన్ని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, సీనియర్ మెంబర్ అసోసియేషన్ ఆఫ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా స్పాన్సర్ చేశారు.

ఈ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను 'గోల్ ఇన్ సారీ' అని పిలుస్తారు. కాగా ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ వీడియోలో.. వైబ్రెంట్ చీర కట్టులో ఉన్న మహిళలు పూర్తి ఉత్సాహంతో బంతి వేనక పరిగెత్తడం కనిపించింది. కాగా ఈ మ్యాచ్ పై ఫుట్ బాల్ ప్రేమికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందులో ఒక అభిమాని.. నా దేశం మహిళలో మెస్సీ కంటే తక్కువేం కాదు.. అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed