- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన భార్య బాధితులు.. అందరినీ ఆలోచింపజేస్తున్న భర్తల డిమాండ్స్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా భార్యలు.. భర్తలతో, అత్తింటి వారితో వేధింపులకు గురవుతుంటారు. అలాంటి వారికోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే భార్యతో వేధించబడే భర్తులు కూడా ఉంటారు. భార్య కొట్టిందని, తిట్టిందని చెప్తే నవ్వుకునేవాళ్లు ఉన్నారు కానీ.. వారి బాధను అర్థం చేసుకునేవాళ్లు ఉండరు. అందుకే ఇలా భార్యలతో బాధింపబడే భర్తల సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు మగ మహారాజులు. ఈక్రమంలోనే మాకు న్యాయం కావాలని పోరాటానికి దిగారు భార్యా బాధిత భర్తలు. ఈ విచిత్ర సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. మరి భర్తల బాధలు ఏంటీ.. అసలు వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం..
బెంగుళూరు నగరంలో ఫ్రీడం పార్కులో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ నేతృత్వంలో భార్యాభర్తల సంఘం రెండు రోజులుగా నిరసనలు చేపట్టారు. తమను, తమ కుటుంబసభ్యులను వాళ్ల భార్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు. గృహహింస చట్టాలను అడ్డుపెట్టుకుని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న తమ కుటుంబసభ్యులను వేధిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా తమకు న్యాయం జరిగేలా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయలని డిమాండ్ చేశారు.
వాటితో పాటుగా మరిన్ని డిమాండ్లను భర్తలు చెప్పారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న భార్యలను శిక్షించాలని కోరారు. విడాకులు ఇచ్చిన తర్వాత భార్య శ్రీమంతురాలైతే భర్త భరణం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. వృద్ధులైన అత్తమామలను వారు వేధిస్తూ వారిపై పెట్టిన కేసులను రద్దు చేయాలి. భార్య పుట్టింటి నుంచి వచ్చే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలకు ప్రభుత్వాలు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా చేయనున్నట్లు తెలిపారు భర్తలు.