మేకప్ సమయంలో మారిన రూపం.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు

by Javid Pasha |   ( Updated:2023-03-05 15:45:18.0  )
మేకప్ సమయంలో మారిన రూపం.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు
X

దిశ, వెబ్ డెస్క్: ముఖానికి మేకప్ వేసుకున్న వధువు రూపం వికారంగా తయారవడంతో పెళ్లి క్యాన్సిల్ అయిన ఘటన కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హస్సాన్ జిల్లాలోని అరాస్ కెరే గ్రామంలో ఇంకో కొన్ని గంటల్లో పెళ్లి అనగా ఓ పెళ్లి కూతురు మేకప్ కోసమని బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే కొంచెం వైరైటీగా ట్రై చేద్దామని అనుకున్న సదరు యువతి.. ముఖానికి రకరకాల క్రీమ్స్ పూసింది. అనంతరం ముఖానికి స్టీమ్ అప్లై చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె ముఖం కందిపోయి నల్లగా మారి బాగా ఉబ్బింది.

దీంతో ఆమె వికారంగా తయారైంది. ఆ రూపంలో ఆమెను చూసిన పెళ్లి కొడుకు పెళ్లి వద్దని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెళ్లి క్యాన్సిల్ కావడంతో దీనంతటికీ కారణమైన బ్యూటీ పార్లర్ ఓనర్ గంగాపై యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read..

బతికుండగానే అంత్యక్రియలు.. శవపేటికపై లేచి కూర్చున్న వృద్ధుడు

Advertisement

Next Story