BREAKING: జగిత్యాల జిల్లాలో గాలి, వాన బీభత్సం.. విరిగిపడిన తాటి చెట్టు (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-08 12:57:13.0  )
BREAKING: జగిత్యాల జిల్లాలో గాలి, వాన బీభత్సం.. విరిగిపడిన తాటి చెట్టు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: భానుడి భగభగతో అతలాకుతలం అవుతోన్న ప్రజలను ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ఇన్నాళ్లు ఉక్కపోతతో బెంబేలెత్తుతున్న జనానికి ఇవాళ కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. వాయు దేవుడి ప్రతాపానికి పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో ఏకంగా బాహుబలి సీన్‌ను తలదన్నేలా.. ఓ తాటి చెట్టు స్ప్రింగ్ల్‌లా వంగి మధ్యలోకి విరిగిపోయింది. ఈ ప్రమాదంలో తాటి చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో స్తంభం కూడా విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read More...

హైదరాబాద్‌లో భారీ వర్షం.. అతలాకుతలం అవుతున్న పట్టణం (వీడియో)

Advertisement

Next Story