Bengaluru: అబ్బో ఆదర్శ మహిళ..! స్కార్ఫ్‌తో సెల్‌ఫోన్ చెవికి కట్టుకుని స్కూటీ రైడింగ్ (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-03-28 04:19:45.0  )
Bengaluru: అబ్బో ఆదర్శ మహిళ..! స్కార్ఫ్‌తో సెల్‌ఫోన్ చెవికి కట్టుకుని స్కూటీ రైడింగ్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్‌ఫోన్ ఈ రోజుల్లో అతి ముఖ్యమైన సాధనం. పస్తులైనా ఉంటారు. కానీ, క్షణం ఫోన్ లేకుండా ఉండని మనిషంటూ ఉండరు. తిన్నా, పడుకున్నా, తిరగుతున్నా అరచేతిలో అది ఉడాల్సిందే. అయితే, తాజాగా బెంగళూరు పట్టణంలోని విద్యారణ్యపురాలో ఓ మహిళ చేసిన సహసం చూసి నెటిజన్లు ఔరా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. స్కూటీపై వెళుతూ.. ఫోన్ మాట్లాడేందుకు సదరు మహిళ వినూత్నంగా ఆలోచించింది. మెడలో వేసుకోవాల్సిన స్కా్ర్ఫ్‌తో ఎంచక్కా సెల్‌ఫోన్‌ను కుడి చెవికి తలకు కట్టేసి బైక్ నడుపుతూ కాల్ మాట్లాడుతూ.. వెళ్తోంది. అయితే, అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయగా అది కాస్త ప్రస్తుంతం సోషల్ విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదో సరికొత్త ఇన్నోవేషన్ అంటూ కామెంట్ చేస్తున్నరు, మరికొందరేమో నగరంలో ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాలు ఉన్నాయి జర భద్రం అంటూ రిప్లై ఇస్తున్నారు.

Advertisement

Next Story