విజయదశమినాడు పుట్టిన పాప.. డాక్టర్ ఎంత అందంగా రెడీ చేసిందో చూడండి.. సో క్యూట్

by Y.Nagarani |
విజయదశమినాడు పుట్టిన పాప.. డాక్టర్ ఎంత అందంగా రెడీ చేసిందో చూడండి.. సో క్యూట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష కొద్దికొద్దిగా మారుతూ వస్తోంది. ఆడపిల్ల పుడితే.. తల్లిదండ్రులు భారంగా భావించే రోజులు పోయాయి అని కచ్చితంగా చెప్పలేం. కానీ.. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవిగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు. మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పుట్టిన ఆడపిల్లను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు. అష్టలక్ష్ములు కలిసిన ఐశ్వర్య లక్ష్మే ఇంటికొచ్చిందని సంబరపడిపోతారు. మరి హిందువులు ఎంతో ప్రత్యేకంగా, సంబురంగా జరుపుకునే విజయదశమి రోజున పుట్టిన ఆడపిల్లని ఇంకెలా చూస్తారో కదా.

రాక్షస సంహారం చేసి.. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అభయమిచ్చిన రోజును విజయదశమిగా జరుపుకుంటాం. ఈ రోజు వెనుక ఎన్నో పురాణ కథలున్నా.. అమ్మవారు రాక్షససంహారం చేసిన గుర్తుగానే ఈ పండుగను జరుపుకుంటాం. పండుగ రోజున ఓ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూసిన వైద్యురాలు.. ఎంతో ముద్దుగా రెడీ చేసింది. పాప తలకు చిన్నపాటి కిరీటం పెట్టి.. ఎర్రని వస్త్రాన్ని కట్టి, ముఖాన తిలకం దిద్ది చాలా అందంగా రెడీ చేసి.. వారి కుటుంబ సభ్యులకు, తల్లికి చూపించింది.

పాపను అలా చూసిన తల్లి ఎంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులైతే పాప కాళ్లకు దండం పెట్టి.. ముద్దాడారు. ఇకికడ మరో విశేషం ఏంటంటే.. అప్పుడే పుట్టిన పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తారంటారు. కానీ.. ఈ పాప మాత్రం అస్సలు ఏడవనే లేదు. డాక్టర్ ఆ పాపను ఎత్తుకుని అందరికీ చూపిస్తుంటే.. కళ్లను ఆర్పుతూ.. అందరినీ ఎవరా వీళ్లంతా అన్నట్టు చూస్తోంది. ఈ వీడియోను వినీతా సింగ్ అనే మహిళ ఎక్స్ లో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. పాప చాలా క్యూట్ గా ఉంది అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ క్యూట్ వీడియో మీరుకూడా ఇక్కడ ఓసారి చూసేయండి.

Advertisement

Next Story