- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral: వామ్మో .. ఇలాంటి బైక్ లు మన దేశంలో ఉన్నాయా.. జ్యూస్ పాయింట్ గా మారిన టూ వీలర్ ?

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు వారి ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. కొందరు ఒక వస్తువును వేరే వస్తువుగా మార్చి వాడుతుంటారు. ఉదాహరణకు సైకిల్ ను వాషింగ్ మెషీన్‌లా ఉపయోగిస్తుంటారు. ఇంకొందరు వంటింట్లో ఉండే పాత్రలను హెల్మెట్‌గా ధరించి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అతను ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
ఈ వీడియోలో అతడు, తన బైక్‌ను ATM జ్యూస్ పాయింట్ గా మార్చేసిన తీరు అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అంతే కాకుండా, దీని నుంచి డబ్బులు కూడా విత్ డ్రా చేశాడు. దానిలో నుంచి జ్యూస్ తీసుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. " ఓ యువకుడు బైక్ ముందు భాగంలో ఏటీఎం కీ బోర్డు పెట్టాడు. దానిలోని నంబర్లను నొక్కుతూ అతడు గ్లాస్‌లోకి జ్యూస్ తీసుకుని తాగుతూ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత, తన కార్డును కూడా వెనక్కి తీసుకున్నాడు". ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడి ట్యాలెంట్‌కి ఫిదా అవుతున్నారు.