ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. కట్నం ఎంతైనా తిరిగి నేనే ఇస్తా.. నడి రోడ్డుపై ప్రకటిస్తున్న యువకుడు (వీడియో)

by Hamsa |   ( Updated:2023-01-28 10:51:18.0  )
ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. కట్నం ఎంతైనా తిరిగి నేనే ఇస్తా.. నడి రోడ్డుపై ప్రకటిస్తున్న యువకుడు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి తమ అమ్మాయికి భర్తగా రావాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు వెతుకుతుంటారు. కానీ, మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓ యువకుడి వినూత్న ప్రచారం చేశాడు. రద్దీగా ఉన్న ఫౌంటెయిన్ చౌక్ వీధిలో పెద్ద ప్లకార్డు పట్టుకుని నిలుచున్నాడు. పసుపు రంగు పేపర్‌పై హిందీలో పెద్ద అక్షరాలతో రాసి దానిని పట్టుకుని నిల్చున్నాడు. అందులో ''ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు కావాలి. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయికి నేను ఎదురు కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని రాసి ఉంది. అయితే, అసలు విషయం ఏమిటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లాడేందుకు వికల్ప్ మాల్వి ఈ పనిచేయలేదట. అందరినీ నవ్వించడం కోసం భిన్నంగా అలా చేశానని, తనను ప్రశ్నించిన వారికి చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story