లోన్ కోసం చనిపోయిన వృద్దుడితో బ్యాంకుకు మహిళ!.. ఎలా దొరికిపోయిందో తెలుసా?(వీడియో)

by Disha Web Desk 5 |
లోన్ కోసం చనిపోయిన వృద్దుడితో బ్యాంకుకు మహిళ!.. ఎలా దొరికిపోయిందో తెలుసా?(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: చనిపోయిన వృద్దుడిని బ్రతికే ఉన్నాడని చెబుతూ.. ఓ మహిళ బ్యాంకు లోనుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఓ మహిళ వీల్ చైర్ లో ఉన్న ఓ వృద్దుడితో బ్యాంకులోకి ప్రవేశించింది. ఆయన తన బందువు పాలో రాబర్టో బ్రాగా అని, తనకు లోన్ ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులను అడిగింది. వీల్ చైర్ లో పడిపోయి ఉన్న ఆ వృద్దుడిని చూసిన బ్యాంకు అధికారులు అనుమానంతో లోన్ కోసం అతనితో సంతకం చేయించాలని ఆ మహిళకు సూచించారు. దీంతో ఆ మహిళ వృద్దుడి తల పట్టుకొని పైకి లేపుతూ.. సంతకం చేయాలని ఆ వృద్దుడి వేళ్ల మధ్యలో పెన్ను పెట్టే ప్రయత్నం చేయడం అధికారులు గుర్తించారు.

ఇది అనైతికంగా కనిపిస్తుందని ఆ మహిళతో అనగా.. తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నిస్తూ.. ఆ వృద్దుడితో మీకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను హస్పిటల్ కు తీసుకెళ్లగలను, మళ్లీ హస్పిటల్ కు వెళ్లాలని ఉందా? అంటూ సంతకం పెట్టించే ప్రయత్నం చేసింది. బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఆ మహిళను విచారించి ఆ వృద్దుడు కొన్ని గంటల క్రితమే చనిపోయాడని బయటపెట్టారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చనిపోయిన వ్యక్తికి లోన్ ఇప్పించి బ్యాంకు అధికారులను బురిడి కొట్టించాలని చూసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఎరికా డిసౌజా అని, చనిపోయిన వృద్దుడు తన మేనమామ అని, తన సంరక్షణలోనే ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది.


Next Story

Most Viewed