బాయ్ ఫ్రెండ్‌తో భర్తకి అడ్డంగా దొరికిపోయిన భార్య

by Javid Pasha |
బాయ్ ఫ్రెండ్‌తో భర్తకి అడ్డంగా దొరికిపోయిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టేలేసుకుంటూ భర్తకి అడ్డంగా దొరికింది ఓ భార్య. భర్త నిలదీసేసరికి అతడిపై దాడి చేసింది. వివరాల్లోకి వస్తే.. తనను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని యువకుడిని బెదిరించి పెళ్లి చేసుకుంది ఓ యువతి. కానీ పెళ్లైన కొన్ని రోజులకే భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రియుడితో కలిసి షాపింగ్ మాల్ కు వచ్చింది సదరు యువతి. ప్రియుడి చేతిలో చేయి వేసి ఎంచక్కా మాల్ అంతా తిరగసాగింది. అయితే ఇంతలోనే ఆమె తన భర్త కంటబడింది. దీంతో భర్త ఆమెను నిలదీశాడు. ఎవరితో తిరుగుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే అందుకు ఆ యువతి అతను తనకు అన్న అవుతాడు అని చెప్పింది. దీంతో సీరియస్ అయిన భర్త ‘‘ఇక నీ బండారం బయటపడింది. నీకు విడాకులు ఇస్తా’’ అని అనండంతో భర్తపై దాడికి దిగిందా యువది. తాజాగా ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ యువతిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. భర్తను మోసం చేస్తూ ఈ పాడు పనులు ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ వీడియోను సాక్షాత్తు భర్తే దగ్గరుండి తీశాడు.

Advertisement

Next Story