ఇదేం పాడు పనిరా నాయనా.. రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్‌ సీట్ ను నాకుతున్న పార్టీ అభ్యర్థి..

by Sumithra |
ఇదేం పాడు పనిరా నాయనా.. రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్‌ సీట్ ను నాకుతున్న పార్టీ అభ్యర్థి..
X

దిశ, ఫీచర్స్ : రైల్వే స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు ఎంత మురికిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయని రైల్వే శాఖ అనేక ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వాస్తవంగా చాలా స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఈ టాయిలెట్లకు వెళ్లి టాయిలెట్ సీటును నాలుకతో నాకడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ? ఊహించుకుంటేనే వికారంగా ఉంది కదా. కానీ ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో జర్మన్ కి చెందిన ఓ అభ్యర్థి ఇలాంటి నీచమైన పనులు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన వారంతా వాంతులు చేసుకోకతప్పడం లేదు.

ఈ జర్మనీకి చెందిన ఎన్నికల అభ్యర్థి టాయిలెట్ సీట్‌ను ఎలా నాకుతున్నాడో వీడియోలో చూడవచ్చు. ఆపై అతను టాయిలెట్ క్లీనింగ్ బ్రష్‌ను కూడా నాకడం ప్రారంభించాడు. అతని పేరు మార్టిన్ న్యూమైర్ అని చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్‌లో అతడు నీచమైన పనికి పాల్పడ్డాడని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎలా చేరిందో ఇంకా వెల్లడి కానప్పటికీ, వీడియో బయటకు రావడంతో, అతని నామినేషన్ రద్దయినట్టు చెబుతున్నారు. అయితే అతను ఓ పార్టీ అభ్యర్థిగా చెబుతున్నారు.

ఈ వీడియో @EndWokeness అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేశారు. కేవలం 35 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వీక్షించగా, 30 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. మరికొంత మంది అనేక రియాక్షన్‌లు ఇచ్చారు.

Advertisement

Next Story