Viral News : కోయ్ కోయ్.. కోడికి ఘనంగా సన్మానం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by M.Rajitha |
Viral News : కోయ్ కోయ్.. కోడికి ఘనంగా సన్మానం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : కోయ్ కోయ్ అంటూ అంతా కలిసి ఆ కోడికి సన్మానం చేశారు. ఎందుకు వీరు కోడికి సన్మానం చేశారో వివరాలు తెలుసుకుందాం. రంగారెడ్డి(Rangareddy) జిల్లా మొయినాబాద్ పరిధిలోని అజీజ్ నగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కొందరు కోడిపందేలు(Kodi Pandelu) నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసి, రూ.10 వేల డబ్బుతోపాటు ఒక కోడిపుంజును, కోడికత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులంతా బెయిల్ మీద విడుదల కాగా.. కోడిని వేలం వేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జరిపిన వేలంలో ఆ కోడి ఏకంగా రూ. 2,300 కు అమ్ముడు పోయింది. గగన్ పహాడ్ కు చెందిన రామకృష్ణ ఆ కోడిని దక్కించుకోగా.. ఆ కోడిని తన ఫాంహౌసులో పెంచుతానని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అతని బంధుమిత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ కోడికి సన్మానం చేశారు. అదీ.. మన కోయ్ కోయ్ కోడిగారి సన్మానం వెనుకున్న కథ.

Next Story

Most Viewed