రేయ్ ఎవర్రా మీరంతా? కారును హెలికాప్టర్‌గా మార్చేసారు!

by Ramesh N |   ( Updated:2024-03-20 08:48:26.0  )
రేయ్ ఎవర్రా మీరంతా?  కారును హెలికాప్టర్‌గా మార్చేసారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెకానిక్‌లు తమ వాహనాలను వివిధ ఆకృతుల్లో మాడీఫై చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఖజురి బజార్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మారుతి వ్యాగనర్‌ను హెలికాప్టర్‌గా మాడిఫై చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయితే అన్నదమ్ములు హెలికాప్టర్ కారును తాజాగా రోడ్డుపైకి తెచ్చారు.

ఈ కారు హెలికాప్టర్‌కు కలర్ వేయించేందుకు అక్బర్‌పుర్‌కు తీసుకెళుతుండగా.. గమనించిన ట్రాఫిక్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాగా, ఇండియాలో ట్యాలెంట్‌కు కొదవ లేదని, అర్టీస్ట్‌లను ఎంకరేజ్ చేయకుండా ఈ అరెస్టులు ఏమిటని నెటిజన్లు స్పందిస్తున్నారు. కారు హెలికాప్టర్ చేయడం ఏంట్రా? ఎవర్రా మీరు ఇంత తేడాగా ఉన్నారు? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కారు హెలికాప్టర్ గాల్లోకి ఎగురుతుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story