ట్రైన్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

by Anukaran |   ( Updated:2020-07-18 02:09:14.0  )
ట్రైన్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా-గయా జంక్షన్ పరిధిలోని పోటాహి-నద్వాన్ మధ్యలో ఓ కారు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సమయంలో వచ్చిన జనశతాబ్ది స్పెషల్ ట్రైన్ ఆ కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story