రైలు ప్రమాదమా..ఆత్మహత్యా?

by Shyam |
రైలు ప్రమాదమా..ఆత్మహత్యా?
X

దిశ, వరంగల్
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన ఇన్ని రోజులు ప్రమాదాలు, నేరాల సంఖ్య గణనీయంగా పడిపోయింది.కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలించిన కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం, మరణాల రేటు కూడా పెరుగుతూ వస్తోంది.ఈ క్రమంలోనే జనగామ జిల్లా పెంబర్తి రైల్వే స్టేషన్‌‌‌లోని రైలు పట్టాలపై శనివారం ఓ యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడు.విధి నిర్వహణలో ఉన్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం..జనగామ పట్టణంలోని సాయినగర్‌కు చెందిన బి రవి(24) పెంబర్తి వెళ్లే దారిలో గల మల్లన్న గుడి సమీపంలోని రైల్వేట్రాక్ విగత జీవిగా పడి ఉన్నాడు. ఆ యువకుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకుని మరణించాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇంకా తెలియ రాలేదు. రైల్వే పోలీసులు మాత్రం రవి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed