వామ్మో.. ఆ యువతికి 22 చలానాలు.. పోలీసులు ఏంచేశారంటే..?

by Shyam |   ( Updated:2021-06-15 23:59:19.0  )
Hyderabad Traffic Police Challan young woman for violating the rules
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా యువతకు బైక్ దొరికిందంటే వారు రోడ్డుపై విచిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు. హెల్మెట్ లేకుండానో, చేతిలో సెల్ ఫోన్ తోనో లేక స్పీడు డ్రైవింగ్ చేస్తూనో ట్రాఫిక్ పోలీసుల కంటపడి చలానాలు కడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వీటన్నింటికి విరుద్ధంగా ఉండడమే కాదు ఏకంగా పోలీసులు సైతం అవాక్కయేలా చేసింది. అంతలా పోలీసులు అవాక్కయ్యే విషయమేంటంటే.. ఓ యువతి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణాన ఆమెకు ఏకంగా 22 చలానాలకు విధించారు. అందులో ముఖ్యంగా యువతి హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం ఎక్కువగా కనిపించడంతో ఆమెకు 22 చలానాలు పడ్డాయి.

నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చలానా రుసుము మొత్తం రూ. 9,070 ను యువతిచేత కూకట్ పల్లి పోలీసులు కట్టించారు. అంతేకాకుండా యువతికి, ఆమె తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటూ సైబరాబాద్ పోలీసులు యువతి చలానాలను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా..అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అబ్బాయిలకంటే అమ్మాయిలు ఫాస్ట్ గా ఉన్నారుగా అని కొందరు.. అమ్మాయిలు అన్నింటిలోనూ మగవారితో సమానమే అని చెప్పడానికి ఈ యువతే ఉదాహరణ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed