- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూల్స్ బ్రేక్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ఫైన్

X
దిశ, భద్రాచలం టౌన్ : రూల్స్ బ్రేక్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కి సోషల్ మీడియా ఎఫెక్టుతో ఫైన్ పడింది. భద్రాచలంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్రావు తన విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి వాహనం ఫొటోతీసి ఫైన్‌కి సిఫార్సు చేస్తుంటారు. ఓ విధంగా ఆయన అంటే వాహనదారులకు హడల్. కనిపించిన ప్రతీ ఒక్కరికి డ్రైవింగ్ రూల్స్ చెప్పే ఆయనే హెల్మెట్ లేకుండా వాహనంపై వెళుతుండగా ఓ వ్యక్తి ఫొటోతీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి సదరు కానిస్టేబుల్‌కి అక్షింతలు వేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చివరకు ఫైన్ విధించక తప్పలేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.
Next Story