- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ఎవరికీ వినహాయింపు ఇవ్వకుండా అందరి జీవితాలనూ అతలాకుతలం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. అంతేగాకుండా విధినిర్వాహణలో భాగంగా కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న పోలీసులు ఇప్పటికే కరోనా బారిన పడి అనేక మంది మృతిచెందారు. తాజాగా ఏపీలో మరో పోలీస్ అధికారి కరోనాతో కన్నుమూశారు. అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న సీఐ రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం చనిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్న సమయంలో.. తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని అన్నారు. సీఐ రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.