- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీలాగా చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ చేయదు : పొన్నం
దిశ, కరీంనగర్:
తెలంగాణ ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కామెంట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముస్తాబాద్ మండలం బదనకల్‌లో కేటీఆర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలా శవాలపై పేలాలు ఎరుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని పొన్నం స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై తాము దీక్ష చేస్తున్నామని తెలియగానే కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడారని తెలిపారు.చిత్తశుద్ది ఉంటే రైతాంగానికి సేవలందిస్తున్న ప్రాజెక్టులు ఎవరు కట్టారో చర్చకు సిద్దామా అని పొన్నం సవాల్ విసిరారు. జిందాతిలస్మాత్ మందులాగా అన్నింటికి కాళేశ్వరం అంటున్నారని, నిజంగానే కాళేశ్వరం నీరు సాగు నీటికి మళ్లించినట్టయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 150 టీఎంసీల నీరు సముద్రంలో ఎలా కలిశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జలదీక్షతో భయం లేదనుకుంటే పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేయొద్దన్నారు. 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ వద్దకు కాళేశ్వరం నీరు వెళ్లాయని చెప్తున్న కేటీఆర్, 4సార్లు ఆయన్ను గెలిపించిన సిరిసిల్లకు ఎందుకు నీరివ్వలేదో ఎగువ మానేరు ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదో చెప్పాలన్నారు. మంత్రి సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా వివరణ ఇవ్వాలన్నారు. తక్కువ నిధులు వెచ్చిస్తే పూర్తయ్యేందుకు సిద్ధంగా ఉన్న 30 ప్రాజెక్టులను వదిలేసి, కాళేశ్వరం పేరిట రీ డిజైన్ పేరిట రూ.80వేల కోట్లు అప్పుల చేశారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రతిపక్షాలు, పాత్రికేయుల గొంతు నొక్కడం ద్వారా బాగా పరిపాలన చేస్తున్నామన్న ఊహల్లో కొనసాగడం మంచిది కాదని పొన్నం మంత్రి కేటీఆర్‌కు హితవు పలికారు.