- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క చాన్స్ ఇవ్వండి.. కేసీఆర్, ఈటల మధ్య డీల్ కుదిరింది : రేవంత్ రెడ్డి
దిశ, హుజురాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే విద్యార్థులు, యువత కీలక భూమిక పోషించాలని భావించే విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ అభ్యర్థి ఎంపికను తాము అషామాషీగా తీసుకోలేదని స్పష్టంచేశారు. తెలంగాణ కేసీఆర్ వల్లే రాలేదని, కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిందని స్పష్టంచేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆనాడు సుష్మాస్వరాజ్ కాళ్లు మొక్కితే తెలంగాణకు మార్గం సుగమం అయ్యిందన్నారు. అదే విధంగా హుజురాబాద్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడైన వెంకట్‌ను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
మోడీ, కేడీలు కలసి దోచుకున్నారని.. కేసీఆర్, రాజేందర్‌ల వద్ద ఉన్నట్టుగా మా దగ్గర డబ్బులు లేవన్నారు. పొద్దున కొనుగోలు చేసిన నాయకున్ని తిరిగి సాయంత్రం కొనుగోలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అమ్ముడుపోయిన నాయకులను కసబ్ అని పిలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వస్తుందని ఆశతో పోయిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదన్నారు. కోవర్టు ఆపరేషన్ చేసిన కౌశిక్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. కేసీఆర్ పక్కలో బల్లెంలా తయారయ్యే బల్మూరి వెంకట్‌ను గెలిపించాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో బండికి, గుండుకు ఓటు వేశారని వారు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజేందర్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని.. కేసీఆర్, ఈటల వ్యక్తిగత స్వార్థం ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘దొంగలు దొంగలు గట్లు పంచుకున్నట్టుగా కేసీఆర్, రాజేందర్‌ల పంచాయితీ ఉందన్నారు. రాజేందర్‌ను వెల్లగొట్టాలని కేసీఆర్, తనపై కేసులు పెట్టొద్దని, తన భూములు లాక్కొవద్దని రాజేందర్ అనుకుని తమ లక్ష్యం నెరవేర్చుకున్నారన్నారు’. అయితే, ప్రజా సమస్యల గురించి మాత్రం ఇద్దరికీ పట్టింపులేదన్నారు. వీరికి తోడు అల్లుడు హరీష్ రావును మిత్ర ద్రోహిగా మిగిలిపోయారన్నారు. రాజేందర్, హరీష్ రావుల మధ్య రాజకీయ విభేదాలు తప్పా వ్యాపార లావాదేవీలు అలాగే ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బిడ్డను బిర్లాను చేసి, కొడుకును టాటాను చేశాడన్నారు. ఉపఎన్నికల్లో మాటలు చెప్పి గెల్చిన టీఆర్ఎస్, బీజేపీలు అభివృద్ది చేయలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి సీట్లు అధికంగా వచ్చినా ఒరిగిందేమీ లేదన్నారు. హుజురాబాద్‌లో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని రేవంత్ ప్రజలను కోరారు.