రైతుల సమస్యలపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రేపటి నుంచే కార్యచరణ

by Shyam |
TPCC Chief Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరి కొనుగోలు చేయమని చివరకు బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తీరుతో రైతులు రోడ్డెక్కారని గుర్తు చేశారు. కామారెడ్డిలో ఓ రైతు వరికుప్ప మీదనే చనిపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు సమస్యలు, వరి ధాన్య కొనుగోళ్లపై కాంగ్రెస్ కార్యచరణ మొదలుపెట్టిందన్నారు. రేపటి నుంచే కాంగ్రెస్ బృందాలు ఆయా జిల్లాలో విస్తృతంగా పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరోవైపు ట్యాక్సుల పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీపై ప్రభుత్వ విధానాలపై కూడా పోరాటం సాగిస్తామన్నారు. పెట్రోల్-డీజిల్-గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక మూడో విషయానికొస్తే భవిష్యత్తులో నిరుద్యోగ జంగ్ సైరన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళిత బంధును ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఎన్నిక అనంతరం కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed