టీఆర్ఎస్‌కు వైబ్రేషన్స్‌ స్టార్ట్.. మాణిక్కం ఠాగూర్ సెన్సేషనల్ కామెంట్స్

by Shyam |
TPCC incharge Manickam Tagore
X

దిశ, పరిగి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతోన్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వైబ్రేషన్స్‌ స్టార్ట్ అయ్యాయని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ ఇన్‌చార్జి, ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఠాగూర్ పాల్గొని మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయం అని అన్నారు. బంగారు తెలంగాణ, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇలా అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ఆమెకు గిఫ్ట్ ఇవ్వాలని, ప్రస్తుతం తెలంగాణ ప్రజల మదిలో కూడా ఇదే ఆలోచన ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు అన్నారు. కష్టపడి పనిచేసే అందరికీ పార్టీలో భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జగదీష్, టీపీసీసీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, మన్నే సతీష్, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story