- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ పునాదులు బలంగా ఉన్నాయి: ఉత్తమ్
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని, పార్టీ నేడు పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషియే కారణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశం గాంధీభవన్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిదన్నారు. కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి నిలయమైందని విమర్శించారు.
రాష్ట్రంలో పోలీస్‌లు కూడా వన్‌సైడ్‌గా పని చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని తొకేస్తున్నారని, మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. డీసీసీ అధ్యక్షులంతా అంశాల వారిగా పోరాటాలు చేయాలని, ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో టీఆర్ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని, వాళ్లంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారని, వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని, నిరంతరం అండగా అందుబాటులో ఉంటానన్నారు.