ఆగస్టు నుంచి పున:ప్రారంభం : మంత్రి అవంతి

by srinivas |
ఆగస్టు నుంచి పున:ప్రారంభం : మంత్రి అవంతి
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. అమరావతిలో టూరిజం డిపార్ట్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలోని పర్యాటక ప్రాంతాలను ఆగష్టు 1 నుంచి తెరుస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు.

Advertisement

Next Story