- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ .. విజయం ఎవరిది..?
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రౌండులో 56వేల ఓట్ల చొప్పున లెక్కించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవటంతో ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. మూడు జిల్లాల్లో మొత్తం 5,31,268 మంది ఓటర్లకు గాను 3,57,354 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లెక్కింపు ప్రక్రియలో 806 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. తొలుత చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించి 25 చొప్పున కట్టలు కడుతారు. ఆ తరువాత ప్రాధాన్య క్రమంలో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
మొత్తం ఎనిమిది చాంబర్లు ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు సిద్దం చేశారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లను పోటీచేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు. ఉదయం 6.30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాల్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. బ్యాలెట్ బాక్సులను ముందుగా ఏజెంట్లకు చూపించి పరిశీలన చేసి వారి సంతకం తీసుకున్న తర్వాతే తెరుస్తారు. కౌంటింగ్ హాల్ లోకి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు వద్ద సెల్ ఫోన్లు , పెన్ను, పుస్తకాలు అనుమతించరు. ఏజెంట్లకు ఎన్నికల అధికారులే పెన్సిల్, నోట్ బుక్ లను అందిస్తారు. ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పెట్టె అవకాశం ఉంది. దీంతో విడుతల వారీగా పనిచేసేందుకు అధికారులకు, సిబ్బందికి విధుల కేటాయించారు.
లెక్కింపు ప్రక్రియ ఇలా…
లెక్కింపునకు మొత్తం 8 హాళ్లను వినియోగిస్తున్నారు. ఒక్కో హాళ్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటిపై 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్ పత్రాలను ఉంచిన అనంతరం 25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కడతారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం 25 చొప్పున బ్యాలెట్ పత్రాను ఒక కట్ట కట్టడానికె అధిక సమయం పట్టే అవకాశం ఉంది.. అంటే ఉ.8గం.లకు లెక్కింపు ప్రారంభమైతే రాత్రి 8గం.వరకు కేవలం బ్యాలెట్ పత్రాలను కట్ట కట్టే ప్రక్రియ సాగే అవకాశం ఉంది. అనంతరం కట్ట కట్టిన బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తారు. అప్పుడు మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు.
ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. ఇది సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే తొలి సమాచారం తెలిసే అవకాశం ఉంది. టేబుల్‌కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. 357354 ఓట్లను లెక్కించడానికి దాదాపు పది గంటల సమయం పడుతుందని అంచనా. రెండో రోజు ఉదయానికి కానీ ఎవరు గెలుపునకు దగ్గర్లో ఉన్నారనేది తేలదు. ఈనెల 17న ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున 19వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందికి కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా సమావేశం నిర్వహించి లెక్కింపు ప్రక్రియ గురించి వివరించారు.