టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మృతి..

by Anukaran |   ( Updated:2020-10-10 09:38:29.0  )
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ :

సినిమా మీదున్న పిచ్చి ఏదైనా చేసేలా చేస్తుంది. ఎన్ని కష్టాలు పడినా సరే, డైరెక్టర్‌గా రాణించాలని.. ఒక్కసారైనా దర్శకుడిగా తమ పేరును సినిమా బిగ్ స్క్రీన్‌పై టైటిల్ కార్ద్స్‌లో చూడాలని తపన పడిపోతుంటారు. అలాంటి ఒక యంగ్ డైరెక్టర్ ప్రవీణ్.. కల నిజమయ్యే సమయానికి కన్ను మూశాడు. అది కూడా ఆ కల నిజం చేసుకునే ప్రయాణంలోనే ప్రమాదానికి గురై చనిపోయాడు. ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర ‘రణరంగం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన ప్రవీణ్.. ఆహా ఓటిటీ ఒరిజినల్ కంటెంట్ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు.

ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రవీణ్.. ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసే టైంలో ప్రమాదానికి గురయ్యాడు. కారు నడపాల్సిన యాక్షన్ సీన్‌లో.. ఎలా డ్రైవ్ చేయాలో తాను చూపిస్తానని చెప్పిన ప్రవీణ్ .. చూపించే క్రమంలోనే యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.

Advertisement

Next Story