- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ ని ఫాలో అవుతున్న బుట్టబొమ్మ.. ఏ విషయంలోనో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసవి కాలంలో పంపే మామిడికాయల గిఫ్ట్ గురించి అందరికి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో పండించిన మామిడికాయలు ప్యాక్ చేసి ఇండస్ట్రీలోని ప్రముఖులకు పంపిస్తూ ఉంటారు. ఇక వాటి కోసం పలువురు సెలబ్రెటీలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని, ఆ గిఫ్ట్ తీసుకున్నాకా పవన్ కి థాంక్స్ చెప్తూ పోస్ట్ లు కూడా పెట్టేవారు. అయితే ఈసారి మాత్రం పవన్ తోట నుండి మామిడికాయలు బయటకు వెళ్లినట్లు కనిపించడం లేదు. కరోనా కారణంగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతుంది. అయితే పవన్ సంప్రదాయాన్ని టాలీవుడ్ బుట్టబొమ్మ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది.
అమ్మడు తన మంగుళూరు లో ఉన్న మామిడి తోట నుంచి మామిడికాయలు ప్యాక్ చేసి ప్రముఖులకు గిఫ్ట్ గా పంపిస్తుందంట. ఇప్పటీకే పూజా మేనేజర్ ప్యాక్స్ చేసి గిఫ్ట్ లు పంపడానికి రెడీ గా ఉంచాడని టాక్. అయితే ఈ విషయం లో పూజా, పవన్ ని ఫాలో అవుతుందా? అని పవన్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం పూజా ఇలాంటి సమయంలో పవన్ ని ఫాలో అవ్వకూడదమ్మా.. మామిడి కాయలతో పాటు కరోనాను కూడా గిఫ్ట్ గా పంపిస్తున్నావా? అంటూ జోక్ లు వేస్తున్నారు. ఏదిఏమైనా పవన్ బాటలోనే పూజ వెళ్తోంది అనేది మాత్రం వాస్తవమనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం పూజా ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలలో నటిస్తుంది.