టాలీవుడ్ డ్రగ్ కేసు: నేడు ఈడీ ముందుకు ఛార్మి.. కెల్విన్ తో సంబంధాల గురించి ఆరా..?

by Anukaran |   ( Updated:2021-09-01 23:55:38.0  )
Tollywood Drugs Case
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం కొనసాగుతోంది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్).. పలువురు సినీ ప్రముఖులతో సహా 12 మందికి నోటీసులు జారీ చేసి వారిని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సుమారు 11 గంటల పాటు ఈడీ ప్రశ్నించి ఆయన నుంచి కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు నటి ఛార్మి కౌర్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో 2015 నుంచి ఇప్పటి వరకు ఆమె బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ కు ఛార్మి అకౌంట్ నుంచి భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్మినే నగదు ట్రాన్స్ ఫర్ చేసిందా..? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలతో కెల్విన్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇకపోతే 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఛార్మి ఎక్సైజ్‌ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story