- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ లో విషాదం.. కరోనాతో యంగ్ డైరెక్టర్ మృతి
దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమను కరోనా వదలడం లేదు. ఇప్పటీకే ఎంతోమంది ప్రముఖులు ఈ కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా టాలీవుడ్ యువ దర్శకుడు కరోనా కాటుకు బలయ్యాడు. రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనా తో ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజుల క్రితం రవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి ఆర్థిక సమస్యలతో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కమెడియన్ సప్తగిరి లక్ష రూపాయలు అందించిన విషయం కూడా విదితమే.. అయితే గత రాత్రి నుండి ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతూనే రవి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రవి మరణంతో టాలీవుడ్ విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పలుచిత్రాలకు రచయితగా పనిచేసిన నంద్యాల రవి నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్మి రావే మా ఇంటికి’ చిత్రంతో డైరెక్టర్ గా మారారు.