- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడే ‘దుబ్బాక’ ఫలితం
దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలిపోనున్నది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీలలో కనిపిస్తోంది. ఫలితం కోసం నియోజక వర్గంతోపాటు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒంటిగంటకల్లా పూర్తి ఫలితం రానుంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,98,766 మంది ఉండగా, 1,64,192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వృద్ధులు, వికలాంగులకు 1,453 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 51 సర్వీస్ ఓట్లు నమోదయ్యాయి.
23 రౌండ్లలో..
గతంలో ఒక్కో హాలులో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించేవారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కోదానిలో ఏడు చొప్పున రెండు హాళ్లలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన 23 రౌండ్లలో ప్రక్రియ పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో 200 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. అభ్యర్థులు 15 మంది చొప్పున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థికి లేదా ఆయన ఏజెంటుకు అనుమతి ఇస్తారని అధికారులు పేర్కొన్నారు.
నిఘా నీడలో
కౌంటింగ్ కేంద్రం వద్ద 357 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు. ఆరుగురు ఏసీపీలు 18 మంది సీఐలు, 38 మంది ఎస్ఐలు, 16 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 229 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా పీసీలు 50 మంది విధుల్లో ఉంటారు. ఏడు సెక్టార్లుగా విభజించి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సీపీ జోయల్ వీటన్నింటినీ పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేవారికి ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. మీడియా, ఎన్నికల సిబ్బంది, ఎన్నికల ఏజెంట్లు సీపీ కార్యాలయం పక్క నుంచి లోపలికి వెళ్లాలి. ప్రెస్ గ్యాలరీ పక్కన వీఐపీల వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించారు. రూప్ టాఫ్, యాక్సెస్ కంట్రోల్, మెటల్ టిటెక్టర్ తదితర విభాగాలకు చెందిన మరో 15 మంది మఫ్టీలో ఉండనున్నారు.
అందరి చూపు ఇటే
ఏ ఉప ఎన్నికల్లో కనిపించని హడావుడి, విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు ఈ ఎన్నికలో కన్పించాయి. ఇక్కడి ఫలితం ఎలా ఉన్నా దాని ప్రభావం రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిరు. దీంతో అందరి చూపూ ఇటే ఉంది. బరిలో 23 మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది.
కౌంటింగ్‌కి సహకరించాలి
కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ‘‘కౌంటింగ్ సెంటర్ చుట్టూ 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగవద్దు. పార్టీ జెండాలు పార్టీ గుర్తులు, ప్ల కార్డ్స్ ధరించవద్దు, ప్రదర్శించవద్దు“ అని సీపీ జోయెల్ డేవిస్ పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లు వాడరాదని, పాటలు పాడరాదని, ఉపన్యాసాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గెలుపొందిన పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటివి చేసినా కఠిన చర్యలు చర్యలు తీసుకుంటామన్నారు.
పార్కింగ్ ప్రదేశాలు
* మీడియా, ప్రజా ప్రతినిధులు, ఎలక్షన్ ఏజెంట్లు, పోలీస్ సిబ్బంది, కమిషనర్ కార్యాలయం వెనుక సైడ్ వాహనాలు పార్కు చేసుకోవాలి.
* ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ గేట్ నుండి లోనికి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద వాహనాలు పార్క్ చేసుకోవాలి.
* వీఐపీలు ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ గ్యాలరీ పక్కన వాహనాలు పార్కు చేసుకోవాలి.
ట్రాఫిక్ డైవర్షన్
* పొన్నాల గ్రామం నుండి వచ్చే ప్రజలు, పొన్నాల గ్రామంలో నుండి రాజీవ్ రహదారి రోడ్డు పై నుండి సిద్దిపేట పట్టణంలోనికి వెళ్లాలి.
* సిద్దిపేట పట్టణం నుండి పొన్నాల గ్రామానికి వచ్చే ప్రజలు పొన్నాల డాబాల మీదుగా రాజీవ్ రహదారి పై నుండి పొన్నాల గ్రామం లోనికి వెళ్లాలి.