- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు తుక్కాపూర్ పంప్‌హౌజ్ ట్రయల్ రన్
దిశ, మెదక్: కాళేశ్వరం జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్ వైపు సాగనున్నాయి. ఇప్పటికే మిడ్ మానేరు జలాశయం నుంచి అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. తాజాగా నేడు సీఎం కేసీఆర్ నియోజవకవర్గం గజ్వేల్‌లో పరిధిలోని తుక్కాపూర్ వద్ద మల్లన్నసాగర్ సర్జ్‌పూల్‌లో మోటారు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ సర్జ్‌పూల్‌లోకి నిర్ణీత సామర్థ్యం మేరకు జలాలు చేరుకోవడంతో గేట్లను మూసివేశారు. సర్జ్‌పూల్ నుంచి పంపులకు వెళ్లే డ్రాఫ్ట్ ట్యూబ్‌లలోకి నీళ్లను వదులుతూ లీకేజీలను పరిశీలించారు. వారం రోజులపాటు సాంకేతికంగా అన్ని విషయాలు పరిశీలించిన అధికారులు మోటార్లను పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సోమవారం మోటార్ల ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. గత శనివారం అక్కారంలోని ఒకటో నంబర్ మోటర్ ట్రయల్ నిర్వహించారు. తుక్కాపూర్ నుంచి కాళేశ్వరం జలాలు అక్కారం, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద మర్కూక్ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి.