- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు పోడు భూములపై అఖిలపక్ష సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రుల సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశమై చర్చించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. క్షేత్రస్థాయిలో పోడు భూములకు సంబంధించిన సమస్యలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతలతో మంత్రుల సబ్ కమిటీ సమావేశం కానుంది. వీరితో పాటు గిరిజన సంక్షేమ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సంబంధిత శాఖల అధికారులో సమావేశం నిర్వహించనున్నారు. శనివారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అఖిలపక్ష నేతలతో భేటీ అవుతున్నట్లు మంత్రి సత్యవతి రాధోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సమావేశాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అఖిలపక్షాలతో భేటీ అవుతున్నారు. కలెక్టరేట్ లో నిర్వహించే సమావేశానికి అఖిలపక్ష నేతలతో పాటు అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. అభిప్రాయాలను తీసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు మంత్రులు తెలిపారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతో పాటు, అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో ఎప్పటి నుంచి కాస్తులో ఉన్నారు… తాత, తండ్రుల వివరాలతో పాటు స్థానికత సంబంధిత వివరాలను సేకరించనున్నారు. ఎక్కువగా ములుగు, జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉండగా మొదటగా ఈ జిల్లాల్లోని అఖిలపక్ష నేతలతో సమావేశం అవుతున్నారు. దీంతో త్వరలోనే పోడు భూముల సమస్యల కొలిక్కి వచ్చే అవకాశం ఉందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.