- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమిళనాడులో కొత్తగా 6,426 కరోనా కేసులు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవడమే కాకుండా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నైలో వైరస్ విజృంభిస్తూ.. నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తమిళనాడులో కొత్తగా 6,426 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 82 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాతో 3,741 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 2,34,114 కేసులు నమోదు అయ్యాయి. చెన్నైలో గత 24 గంటల్లో 1,117 కేసులు వెలుగుచూడటం గమనార్హం. కరోనా నుంచి కోలుకొని 1,72,883 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో 57,490 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story