ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం

by srinivas |
ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్దక, ఆక్వా, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఈ నెల 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అగ్రి కల్చర్​ సొసైటీ నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో నిర్వహిస్తుందన్నారు. అన్నదాతల సమగ్ర అభివృద్ది ద్యేయంగా సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలు యంత్రాలతో నిర్వహించబడుతుందన్నారు. పూర్తి స్ధాయి వ్యవసాయ ప్రదర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతులందరు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఇందులో అన్ని రంగాల రైతులు, వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పరిశ్రమ, మత్స్యపరిశ్రమ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, సంబందిత సంస్ధలు హాజరవుతాయని తెలిపారు. అదే విధంగా విత్తనాలు , ఎరువులు, మందుల కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సహాయక సంస్ధలు, విద్యార్ధులు పాల్గొంటారని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌లో సుమారుగా 400 ప్రదర్శన స్టాళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో సభ్యులు కెవిఎన్​రెడ్డి, భవాని రెడ్డి, గోపాల్​రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story