- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, టీఆర్ఎస్‌పై కోదండరాం సంచలన వ్యాక్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేలా కొత్త చట్టాలను తీసుకొచ్చి రైతులను నడివీధిలో తొక్కి చంపిన బీజేపీకి రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని టీజేఎస్రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ప్రధాన ఎజెండాగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీటి వినియోగం, వ్యవసాయంపై సమగ్ర విధానం రూపొందించకుండా కమీషన్ల దాహార్తి తీర్చుకునేందుకు ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో లక్షల కోట్లు దండుకొని ఊకదంపుడు ఉపన్యాసాలకే టీఆర్ఎస్పరిమితమైందని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇతర పార్టీలు ఎదగొద్దని, ప్రత్యామ్నాయం ఉండొద్దనే బీజేపీ, టీఆర్ఎస్కలిసి కావాలనే డ్రామాలాడుతున్నాయని విమర్శలు చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమ్మక్కై రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు చాలా కాలంగా చట్టసభల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. మీడియాలో పాపులారిటీ కోసమే బండి యాత్రలు, వాటిని టీఆర్ఎస్అడ్డుకునే డ్రామాలాడుతున్నాయని విమర్శలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు రైతులపై కపట ప్రేమను కురిపిస్తున్నాయన్నారు. వ్యవసాయం అంటే వరి సాగు మాత్రమే అనే పరిస్థితికి టీఆర్ఎస్ తీసుకొచ్చిందని, దీంతో రైతులు సహజంగానే వరి పంటపై కొద్దో గొప్పో మిగులు ఉంటుందనే ఆశతో అన్ని పంటలు పండే భూములను లక్షల రూపాయలు ఖర్చు చేసి వరి సాగుకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేశారని గుర్తుచేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు బాధ్యత వహించాల్సిన కేసీఆర్, బండి సంజయ్రైతు భుజం మీద తుపాకి పెట్టి తమ అధికార పరిరక్షణకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.