- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొహ్లీని కెప్టెన్‌గా తొలగించండి : గంభీర్
దిశ, స్పోర్ట్స్: ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విఫలం చెందడానికి కెప్టెన్ కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రతీ ఏడాది కప్ కొడతాం అని బరిలోకి దిగి అభిమానులను నిరాశ పరుస్తున్నదని అతడే అని వెల్లడించాడు. 8 ఏళ్లుగా ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ.. ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాడని, దీంతో కోహ్లీని వెంటనే కెప్టెన్‌గా తొలగించాలని గంభీర్ అన్నాడు. తాను కొహ్లీకి వ్యతిరేకం కాదని.. కానీ ఆర్సీబీ జట్టు మేలు కోసం మాత్రమే చెబుతున్నానని అన్నాడు. కోల్‌కతా కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ తప్పుకున్నాడు. పంజాబ్ కెప్టెన్‌గా అశ్విన్‌ను తప్పించారు. మరి కోహ్లీ టైటిల్ నెగ్గకుండానే 8 ఏళ్ల పాటు ఎందుకు ఉంచారో తనకు అర్థం కావడం లేదన్నాడు. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకొని ఓడిపోయినప్పుడు మాత్రం ఇతరులపై అభాండాలు వేయకూడదని గంభీర్ చెప్పుకొచ్చాడు.