- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ లో.. సోషల్ మీడియా హవా
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 22 నుంచి లాక్ డౌన్ విధించింది. దాంతో ప్రజలందరూ ఇల్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కాలం గడిపే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ , టిక్ టాక్ తదితర సోషల్ మీడియా యాప్స్ ల వాడకం ఎలా ఉందో విశ్లేషించిన ‘కాలాగాటో’ సంస్థ ఆ వివరాలను విడుదల చేసింది.
ఫేస్ బుక్ తో పోల్చితే టిక్ టాక్ లో సమయం గడిపే వారి సంఖ్య పెరిగింది. టిక్‌టాక్‌పై యూజర్లు సరాసరి వెచ్చించే సమయం లాక్‌డౌన్ కారణంగా 39.5 నిమిషాల నుంచి 56,9 నిమిషాలకు పెరిగింది. ఈ విషయంలో 80 కోట్ల మంది యూజర్లను కలిగిన ‘ఫేస్‌బుక్’ను అధిగమించడం విశేషం. అంతేకాదు కేవలం 31 రోజుల్లో 20,2 మిలియన్ పీపుల్ టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. ‘లీవ్‌డాట్‌మీ’ మీద యూజర్లు వెచ్చించే సమయం 315 శాతం పెరగ్గా, బిగో మీద 66 శాతం పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను యూజర్లలో 59 శాతం మంది ప్రతి రోజు సరాసరి ఉపయోగించగా, టిక్‌టాక్‌ను 53 శాతం మంది ఉపయోగించారు. ఫేస్ బుక్, ఇన్ స్టా ల కన్నా.. టిక్‌టాక్, లీవ్‌డాట్‌మీ, బిగో అనూహ్యంగా దూసుకుపోతున్నాయి.
Tags: lockdown, social media, instagram, facebook, tiktok