టిక్‌టాక్‌కు ఆల్టర్నేట్‌గా దేశీ యాప్.. ‘చింగారి’

by Sujitha Rachapalli |
టిక్‌టాక్‌కు ఆల్టర్నేట్‌గా దేశీ యాప్.. ‘చింగారి’
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా యాప్స్ రిమూవ్ చేయాలంటూ.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా చైనా యాప్స్‌ను గుర్తించే యాప్ అందుబాటులోకి రావడం తెలిసిందే. ప్లే స్టోర్ నిబంధనలు పాటించడం లేదంటూ ప్రస్తుతానికైతే ఆ యాప్‌ను తొలగించారు. ఆ సంగతి పక్కనబెడితే.. చైనా బేస్డ్ ప్రొడక్ట్స్‌కు ఆల్టర్నేట్‌గా దేశీ యాప్స్ రూపొందుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన ‘మిత్రోన్‘ యాప్ నెటిజన్ల నుంచి మంచి ఆదరణ పొందింది. తాజాగా బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ కంపెనీ ‘టిక్‌టాక్‌’కు ఆల్టర్నేట్‌గా మరో యాప్‌ను తీసుకొచ్చింది.. అదే ‘చింగారి’ యాప్.

బెంగళూరుకు చెందిన బిస్మాత్మ నాయక్, సిద్దార్థ్ గౌతమిన్ అనే ప్రోగ్రామర్స్ ‘చింగారి’ యాప్‌ను అభివృద్ధి చేశారు. వీడియో అప్‌లోడ్, డౌన్‌లోడ్ అనే ఆప్షన్లు మాత్రమే కాకుండా, ఈ యాప్‌లో ఫ్రెండ్స్‌తోనూ చాట్ చేసుకునే వీలుంది. న్యూ పీపుల్‌తో ఇంటరాక్షన్, కంటెంట్ షేర్, వాట్సాప్ స్టేటస్, వీడియో, ఆడియో క్లిప్స్, జిఫ్ స్టిక్కర్స్, ఫోటోస్ క్రియేట్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అదనపు హంగులు :

వీటన్నింటితో పాటు ట్రెండింగ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, ఫన్నీ వీడియోస్, సాంగ్స్, స్టేటస్ వీడియోస్, కోట్స్, కవితలు, మీమ్స్ ఇవన్నీ కూడా యాప్‌లో భాగంగా ఉన్నాయి.

ఎనిమిది భాషల్లో :

హిందీ, ఇంగ్లీష్ కాకుండా.. ఎనిమిది భారతీయ భాషల్లో ఈ యాప్‌ను తీసుకొచ్చారు. బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళ్, తెలుగు ఆ జాబితాలో ఉన్నాయి.

మనీ ఎర్నింగ్ :

మిగతా యాప్‌లతో పోలిస్తే ‘చింగారి యాప్’ కాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే.. కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోను చింగారి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆయా వీడియోల్లో కొన్ని వైరల్ కావచ్చు, ఇంకొన్ని ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవచ్చు, మరికొన్ని ట్రెండింగ్‌లో నిలవొచ్చు.. ఇలా వ్యూస్‌ని బట్టి సదరు కంటెంట్ క్రియేటర్‌కు పాయింట్స్ వస్తాయి. వాటిని ‘మనీ‘గా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే ఎన్ని వ్యూ‌స్‌కు ఎన్ని పాయింట్స్, ఎన్ని పాయింట్స్‌కు ఎంత మనీ అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉండగా.. ఇప్పటికే లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed