- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్టోపస్ నుంచి ప్రాణాలు కాపాడుకున్న అమెరికన్ టిక్‌టాకర్
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన టిక్‌టిక్ స్టార్ కేలిన్ మేరీ.. ఇటీవలే బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లింది. అక్కడి బీచ్‌లో ఓ చిట్టిపొట్టి ఆక్టోపస్ ఆమెను ఆకర్షించడంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని, ఫొటోలకు పోజులిచ్చింది. కానీ ఆ ఆక్టోపస్ గురించి తెలిసిన తర్వాత మూడు గంటల పాటు ఏడ్చేసింది. ఇంతకీ ఆ ఆక్టోపస్ పేరేంటి? ఆమె ఎందుకు ఏడ్చింది?
కేలిన్ మురిసిపోతూ తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఆక్టోపస్.. ప్రాణాంతక సముద్రపు జీవుల్లో ఒకటైన నీలిరంగు ఆక్టోపస్ (బ్లూ రింగ్డ్ ఆక్టోపస్). చిన్న సైజులో చాలా ముద్దుగా ఉన్న ఆ ఆక్టోపస్ గురించి తెలుసుకోవాలనుకున్న కేలిన్.. ఆన్‌లైన్‌లో దాని గురించి సెర్చ్ చేయగా, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవుల్లో బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ ఒకటని తెలిసింది. కేలిన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పిచుకోగా, ఈ భయానక సంఘటనపై తన తండ్రికి ఫోన్ చేసి తీవ్రంగా ఏడ్చింది. ‘బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌లు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి. 26 మంది(అడల్ట్ హ్యూమన్స్)ను నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఇది కాటు వేసినపుడు నొప్పి తెలియదు. శ్వాసకోస ఇబ్బందులు, పక్షవాతం లాంటి లక్షణాలు కనపడేంతవరకు దాని విషప్రభావం మనకు తెలియదు. పైగా దీని విషానికి విరుగుడు కూడా లేదు’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ :
12- 20 సెం.మీటర్ల పరిమాణంలో ఉండే ఈ ఆక్టోపస్‌లను పట్టుకోవాలని చూసినా, పొరపాటున దాని మీద కాలువేసినా.. నొప్పి తెలియకుండా కుడుతుంది. అయితే అదృష్టవశాత్తు కేలిన్‌ను ఏం చేయలేదు. సాధారణంగా ఇది కుట్టిన 5-10 నిముషాల్లోనే దాని ప్రభావం తెలుస్తుంది. బ్లడ్ బ్లీడింగ్, వికారం, వాంతులు, కళ్లు మసకబారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, పెరలైజ్డ్, వంటి ఇబ్బందులు వస్తాయి. ఇవి కుట్టిన తర్వాత చికిత్స తీసుకోకపోతే 4-10 గంటల్లో చనిపోయే ప్రమాదం ఉంది. వీటి విషానికి విరుగుడు లేకపోగా, ఇవి ఇతర జంతువుల నుంచి ఆపద వస్తే.. వెంటనే అవి తమ చర్మపు రంగుల్ని మారుస్తుంటాయి. పీతలు, హెర్మిట్ పీతలు, రొయ్యలు, ఇతర చిన్న జంతువులతో పాటు చిన్న క్రస్టేసియన్లను ఆహారంగా తీసుకుంటాయి. వాటి వీనమ్‌లో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ టెట్రోడోటాక్సిన్ ఉంటుంది.